Saturday, January 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపుస్తకాల పండుగకు వేళాయే..

పుస్తకాల పండుగకు వేళాయే..

- Advertisement -

ఈ నెల 19నుంచి బుక్‌ఫెయిర్‌ షురూ : నిర్వాహకులు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రతి ఏడాది నిర్వహించే హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌.. ఈ సారి కూడా పుస్తక ప్రియులకు దగ్గరయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 19 నుంచి 29 వరకు 11రోజుల పాటు ఎన్టీఆర్‌ స్టేడియంలో పుస్తక ప్రదర్శన నిర్వహించనున్నట్టు బుక్‌ఫెయిర్‌ సొసైటీ అధ్యక్షులు కవి యాకూబ్‌ తెలిపారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో యాకూబ్‌ అధ్యక్షతన విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కార్యదర్శి ఆర్‌ వాసు, ఉపాధ్యక్షులు బాల్‌రెడ్డి, బి శోభన్‌బాబు, సహాయ కార్యదర్శులు కె సురేష్‌, ఎం సూరిబాబు, కోశాధికారి నారాయణ రెడ్డి, కమిటీ సభ్యులు జనార్దన్‌ గుప్త, సాంబశివ రావు, రజిని తదితరులు మాట్లాడారు. ఈ బుక్‌ ఫెయిర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు వీలుగా ప్రయత్నాలు చేస్తున్నామని వాసు తెలిపారు. బుక్‌ ఫెయిర్‌లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న 367 స్టాల్స్‌లలో ప్రచురణ కర్తలు, పంపిణీదారులు తమ పుస్తకాలను ప్రదర్శించనున్నట్టు తెలిపారు.

ఈ సారి పుస్తక ప్రదర్శన చాలా పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. పిల్లలకు, పెద్దలకు, వృద్దులకు సౌకర్యంగా ఉండేలా.. బుక్‌ఫెయిర్‌లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా, ముఖ్యంగా చిన్న పిల్లలు ఆడుకు నేందుకు అవసరమైన క్రీడా పరికరాలను ఏర్పాటు చేస్తు న్నట్టు పేర్కొన్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంటనుంచి రాత్రి 9గంటల వరకు పుస్తక ప్రియులు సందర్శించ వచ్చాన్నారు. ప్రతి రోజు మూడు సెషన్లు ఉంటాయనీ, కవులు, కళాకారులు పాల్గొంటారనీ, 2 గంటల నుంచి 5గంటల వరకు బాలోత్సవం,5నుంచి 6 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలుంటాయని పేర్కొ న్నారు. తొమ్మిది రోజుల్లో 54 పుస్తకాలు అవిష్కరణ లుంటాయని పేర్కొన్నారు. విద్యార్థులకు ఉచిత ప్రదర్శన ఉంటుందనీ, ఆయా స్టాల్స్‌ ద్వారా 15వేల ఉచిత పాస్‌లు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఒక్కో పాస్‌పై ఇద్దరి చొప్పున అయిపోయేంత వరకు బుక్‌ఫెయిర్‌ను వీక్షించవచ్చని తెలిపారు.

అందెశ్రీ బుక్‌ఫెయిర్‌ ప్రాంగణంగా, సభా కార్యక్ర మాల వేదికను అనిశెట్టి రజిత, పుస్తకావిష్కరణ వేదికకు కొంపెల్లి వెంకటగౌడ్‌,రచయితల స్టాల్‌లకు ప్రొఫెసర్‌ ఎస్వీ రామారావు, మీడియా స్టాల్స్‌కు స్వేచ్ఛవొటార్కర్‌ పేర్లతో నామకరణం చేసినట్టు తెలిపారు. 15న ఎన్టీఆర్‌ గార్డెన్‌లో డ్రా తీయనున్నట్టు, దీన్ని ఆన్‌లైన్‌లో వీక్షించేందుకు వీలు కల్పిస్తున్నట్టు తెలిపారు. 18 సాయంత్రం స్టాల్స్‌ను కేటాయించనున్నారు. గ్రౌండ్‌ డిజైన్‌, టాయిలెట్స్‌ సౌకర్యం, ఫుడ్‌ కోర్టు తదితర సౌకర్యా లను ఎలాంటి ఇబ్బందులు లేకుండా కల్పిస్తున్నట్టు తెలిపారు. గతంలో ఎవరికి తోచినట్టు వారు షాపులను కేటాయించే విధానానికి స్వస్తి పలికి స్కృట్నీ ఎన్నిక ద్వారా కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలను పర్యవేక్షించటానికి, సూచనలు ఇవ్వటానికి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి, సలహాదులుగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం, సీనియర్‌ ఎడిటర్‌ రామచంద్రమూర్తి, రిటైడ్‌ ప్రొఫెసర్‌ రమా మేల్కొటే ఉన్నారని పేర్కొన్నారు. పుస్తక ప్రదర్శన ప్రతిష్ట పెంచేలా, బుక్‌ఫెయిర్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -