Wednesday, October 22, 2025
E-PAPER
Homeజిల్లాలురోడ్ల దుస్థితి గురించి మంత్రిని కలిసిన జేఏసీ నాయకులు..

రోడ్ల దుస్థితి గురించి మంత్రిని కలిసిన జేఏసీ నాయకులు..

- Advertisement -

నవతెలంగాణ –  మిరుదొడ్డి 
మిరుదొడ్డి మండల పరిధిలోని అందె గ్రామంలో గుంతలు పడిన రోడ్ల దుస్థితి గురించి జిల్లా ఇన్చార్జి మంత్రి కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని జేఏసీ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. గత 15 సంవత్సరాల కాలములో వేసిన  పంచాయతీ రాజ్ రోడ్డు, ఆర్ అండ్ బి రోడ్డు పూర్తిగా ధ్వంసము అయ్యాయని, గ్రామంలోని అందే, మిరుదొడ్డి, అందే తిమ్మాపురం, అందే, ఎక్స్ రోడ్డు వరకు, గుంతలు పడిన రోడ్ల గురించి, పాఠశాలలకు కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర  ఇబ్బందులు పడుతున్న పరిస్థితులను గురించి వివరించారు. రైతులు ఆరుగాలని చేసి పండించిన పంటలు మార్కెట్ లో అమ్ముకుంద్దామని వెళ్ళితే, అనేక రోడ్డు ప్రమాదల బారిన పడుతున్నారని తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. మీ సమస్య లను పరిష్కారం చేస్తామని, రోడ్లు వేసే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతులకు విద్యార్థులకు న్యాయం జరిగేటట్టు చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో జే ఏ సి నాయకులు ప్రవీణ్, సోమేశ్వర్ రెడ్డి, రాజు కుమార్, యాదగిరి, పర్శరాములు, సంతోష్, కుమార్, అఖిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -