నవతెలంగాణ – ఆత్మకూరు
బలహీన వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్ రామని రాష్ట్ర పశుసంవర్ధక క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ అన్నారు. బుధవారం రాత్రి పట్టణంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన జీవిత చరిత్ర గురించి మందకృష్ణ వివరించారు. ఎమ్మార్పీఎస్ అంటే ఏ బి సి డి ల వర్గీకరణ కోసం కాదని సమాజంలో సమస్యల కోసం కృషిచేసి విజయాలు సాధించిందని సాధించిన విజయాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో విగ్రహ దాత కురుమూర్తి ,బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులు జానకి రాములు, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు దండు శ్రీను,ఏ లక్ష్మణ్ ,అంబేద్కర్ సంఘం అధ్యక్షులు గాలి పంపు శ్రీనివాసులు ,వివిధ రాజకీయ ప్రజా ప్రతినిధులు, నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, దళిత సంఘ నాయకులు ప్రజలు పాల్గొన్నారు.
బలహీన వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్ రామ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES