Friday, January 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం12 ఏండ్ల తెలంగాణపై జాగృతి అధ్యయనం

12 ఏండ్ల తెలంగాణపై జాగృతి అధ్యయనం

- Advertisement -

30 కమిటీల ఏర్పాటు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ ఏర్పడి 12 ఏండ్లు అవుతున్న సందర్భంగా అన్ని రంగాలను అధ్యయనం చేసేందుకు వీలుగా తెలంగాణ జాగృతి 30 కమిటీలను ఏర్పాటు చేసింది. రాజకీయ పార్టీల రాజ్యాంగాల అధ్యయనానికి ప్రత్యేకం గా ఒక కమిటీని నియమించింది. జాగృతికి ప్రజాస్వామ్యబద్ధమైన, పటిష్టమైన రాజ్యాం గాన్ని రూపొందించడానికి వీలుగా న్యాయ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశారు. వివిధ రంగాలు, వివిధ వర్గాల పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు వేసిన 30 కమిటీల్లో ప్రతి కమిటీలో ముగ్గురు నుంచి నలుగురున్నారు. ప్రతి కమిటీలో మహిళలకు ప్రాతినిథ్యం కల్పించారు. ఈ కమిటీలు 10 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తమకు అప్పగించిన రంగం లో అధ్యయనం చేసి నివేదిక రూపొందిస్తారు. ఆ నివేదికను ఈ నెల 17న స్టీరింగ్‌ కమిటీకి సమర్పిస్తారు.ఆ నివేదికపై రాష్ట్ర స్థాయి కార్యవర్గంలో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణపై అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణ జాగృతి ఒక ప్రకటనలో తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -