Monday, October 27, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంమార్కో రూబియోతో జైశంక‌ర్ భేటీ

మార్కో రూబియోతో జైశంక‌ర్ భేటీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: మ‌లేషియా రాజ‌ధాని కౌలాలంపూర్ వేదికగా ఏషియాన్ స‌ద‌స్సు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈక్ర‌మంలో భార‌త్ త‌రుపున విదేశాంగ మంత్రి జైశంక‌ర్ హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోను జైశంకర్ కలిశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు, ద్వైపాక్షిక సంబంధాలు, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై జైశంకర్-రూబియో చర్చించారు. ఈ మేరకు జైశంకర్‌ ఎక్స్‌లో కీలక పోస్ట్ చేశారు. రెండు దేశాల మధ్య కీలక చర్చలు జరిగినట్లుగా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా పంచుకున్నారు.

ర‌ష్యానుంచి చ‌మురు కొనుగోలు చేస్తుంద‌ని భార‌త్ పై ట్రంప్ అద‌న‌పు సుంకాలు విధించిన విష‌యం తెలిసిందే. ఈ స‌ద‌స్సుకు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ హాజ‌ర‌య్యారు. అదే విధంగా పీఎం మోడీ హాజ‌ర‌వుతార‌ని, ట్రంప్-మోడీ స‌మావేశమ‌వుతార‌ని వార్త‌లు పుకార్లు చేశాయి. అయితే బీజీ షెడ్యూల్ కార‌ణంగా ప్ర‌ధాని మోడీ గైర్హాజరయ్యారు. ఏషియాన్ స‌ద‌స్సుకు పీఎం మోడీ వ‌ర్చువ‌ల్ హాజ‌ర‌య్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -