Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంట్రంప్ 'భారత్ జీరో టారిఫ్ ఆఫర్'..స్పందించిన జైశంకర్

ట్రంప్ ‘భారత్ జీరో టారిఫ్ ఆఫర్’..స్పందించిన జైశంకర్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ‘జీరో టారిఫ్’ ఆఫర్ల వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ స్పందించారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే అనేక వస్తువులపై భారత్ ‘జీరో టారిఫ్‌లు’ ఆఫర్ చేసిందని ట్రంప్ అన్నారు.
ఈ వ్యాఖ్యలపై జైశంకర్ స్పందిస్తూ, “రెండు దేశాల మధ్య వాణిజ్యపరమైన చర్చలు జరుగుతున్నాయి. ఇవి చాలా సంక్లిష్టమైన చర్చలు. ప్రతి అంశంపైనా తుది నిర్ణయం తీసుకునే వరకు ఇవి సాగుతూనే ఉంటాయి. వాణిజ్య ఒప్పందం అనేది ఇరు దేశాలకూ పరస్పరం ప్రయోజనకరంగా ఉండాలి. అది ఖరారయ్యే వరకు దాని గురించి ప్రకటన చేయడం తొందరపాటు అవుతుంది” అని ట్రంప్ పేరును నేరుగా ప్రస్తావించకుండానే వివరించారు. భారత్-పాక్ ఉద్రిక్తతలను తగ్గించని పక్షంలో వాణిజ్యం నిలిపేస్తానని ఇరుదేశాలనూ తాను హెచ్చరించానని, ఆ తర్వాతే వారు అంగీకారానికి వచ్చారని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad