ఇండియా 182/3
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా టీ విరామ సమయానికి 3వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్(87) మరోసారి అర్ధసెంచరీతో రాణించాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 15 పరుగుల వద్ద కేఎల్ రాహుల్‌ను కోల్పోయింది. తొలి టెస్టులో సెంచరీతో కదం తొక్కిన కెఎల్ రాహుల్ కేవలం రెండు పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌లో వోక్స్ వేసిన బంతిని డిఫెండ్ చేసే ప్రయత్నంలో రాహుల్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. వోక్స్ వేసిన బంతి రాహుల్ బ్యాట్‌కు తగిలి వికెట్లను గిరాటేసింది. ఆ తర్వాత యశస్వి జైస్వాల్-కరణ్ నాయర్ కలిసి 2వ వికెట్‌కు 80 పరుగులు జోడించారు. ఈ క్రమంలో జైస్వాల్ అర్ధసెంచరీని పూర్తి చేసుకోగా.. కరణ్ నాయర్ 31పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కర్సే బౌలింగ్‌లో బ్రూక్ క్యాచ్ అందుకోవడంతో పెవీలియన్‌కు చేరాడు. ఆ తర్వాత కెఎల్ రాహుల్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కలిసి ధాటిగా ఆడారు. ఈ క్రమంలో జైస్వాల్ సెంచరీకి చేరువవుతున్న దశలో స్టోక్స్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ స్మిత్ క్యాచ్ అందుకోవడంతో ఔటయ్యాడు. మరోవైపు కెప్టెన్ శుభ్‌మన్ ఎక్కువగా డిఫెన్స్‌కే ప్రాధాన్యతనిస్తూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. దీంతో టీమిండియా టీ విరామ సమయానికి 3వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఆ సమయానికి క్రీజ్‌లో గిల్(42), పంత్(14) ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లు వోక్స్, కర్సే, స్టోక్స్‌కు ఒక్కో వికెట్ దక్కాయి.
బుమ్రా, శార్దూల్, సాయి సుదర్శన్‌కు విశ్రాంతి
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌కు టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. పేసర్ జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, సాయి సుదర్శన్‌లకు విశ్రాంతి నిచ్చింది. వీరి స్థానంలో ఆకాశ్‌దీప్, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డిలకు చోటు కల్పించింది. రెండో టెస్ట్‌కు బుమ్రా అందుబాటులో ఉంటాడని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రకటించినా.. జట్టు మేనేజ్‌మెంట్ ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అతడికి ఈ టెస్ట్‌కు దూరంగా ఉంచాలని నిర్ణయించడం గమనార్హం. అలాగే చైనామన్ స్పిన్నర్‌ను ఆడిస్తే భారత్‌కు ప్రయోజనకరంగా ఉంటుందని మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్‌తో పాటు.. సునీల్ గవస్కర్ వంటి భారత దిగ్గజ క్రికెటర్లు టీమిండియా మేనేజ్‌మెంట్‌ను సూచించినా.. అతడికీ రెండో టెస్ట్ తుదిజట్టులో చోటు దక్కలేదు. ఈ మణికట్టు స్పిన్నర్‌కు బదులు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు సెలక్టర్లు తుదిజట్టులో స్థానం ఇచ్చారు. కుల్దీప్‌ను రెండో టెస్ట్‌కు ఎంపిక చేయకపోవడంపై శుభ్‌మన్ స్పందిస్తూ.. ‘ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో మేము మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నాం. రెడ్డి, వాషీలతో పాటు ఆకాశ్ దీప్ జట్టులోకి వచ్చారు. బుమ్రాను ఈ మ్యాచ్‌లో ఆడించడం లేదు. అతడి వర్క్‌లోడ్‌ను దష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. మూడో టెస్టు లార్డ్స్‌లో జరుగనుంది. అక్కడ బుమ్రా అవసరం మాకు ఎక్కువగా ఉంటుంది. అక్కడి పిచ్‌ను బుమ్రా సద్వినియోగం చేసుకోగలడు. అందుకే ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతినిచ్చాం.. ఇక కుల్దీప్ యాదవ్‌ను తీసుకోవాలని ఆఖరి వరకు అనుకున్నాం. అయితే, బ్యాటింగ్‌లో డెప్త్ గురించి ఆలోచించి అతడిని పక్కనపెట్టాం” అని తెలిపాడు.
స్కోర్‌బోర్డు..
ఇండియా తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి)స్మిత్ (బి)స్టోక్స్ 87, కెఎల్ రాహుల్ (బి)క్రిస్ వోక్స్ 2, కరణ్ నాయర్ (సి)బ్రూక్ (బి)కర్సే 31, శుభ్‌మన్ గిల్ (బ్యాటింగ్) 42, పంత్ (బ్యాటింగ్) 14, అదనం 6. (53ఓవర్లలో 3వికెట్ల నష్టానికి) 182పరుగులు.
వికెట్ల పతనం: 1/15, 2/55, 3/161
బౌలింగ్: వోక్స్ 13-5-35-1, కర్సే 11-1-26-1, టంగ్ 10-0-52-0, స్టోక్స్ 10-0-33-1, బషీర్ 9-0-32-0.