Saturday, January 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీ సంఘం మండల ఇంచార్జిగా జక్కం రాజేందర్

బీసీ సంఘం మండల ఇంచార్జిగా జక్కం రాజేందర్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
జాతీయ బీసీ సంఘం మండల ఇంచార్జిగా మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన జక్కం రాజేందర్ నియామకం చేసినట్లుగా ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు బట్టి శ్యాం తెలిపారు. తన నియామకానికి సహకరించిన జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పులి శ్రీనివాస్ గౌడ్, ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లా అధ్యక్షుడు బట్టి శ్యాం, భూపాలపల్లి జిల్లా కమిటీని శుక్రవారం కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బీసీ హక్కుల సాధన కోసం పోరాటం చేస్తూ.. బీసీ కుల సంఘాల అందరిని కలుపుకపోతానని ఈ సందర్భంగా రాజేందర్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -