- Advertisement -
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
జక్రాన్ పల్లి మండల కేంద్రము నుండి నల్లగుట్ట తండా వరకు బిటి రోడ్డు రెన్యూన్ పనులను కాంగ్రెస్ నాయకులు ఆదివారం ప్రారంభించారు. ఇటీవల నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి రెండు కోట్ల రూ.50 లక్షలతో నిధులు మంజూరు చేసి రెనివల్ పనులకు శంకుస్థాపన చేశారు. ఇటీవల ఎలక్షన్ కోడ్ రావడంతో అదేవిధంగా వర్షాలు రావడంతో ప్రారంభించడం లేటు కావడం జరిగినందున ఆదివారం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బీటీ రోడ్ రెన్యూవల్ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జక్రాన్ పల్లి కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



