- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: జమ్మూకశ్మీర్ పేలుడు ఘటనపై డీజీపీ నళిన్ ప్రభాత్ మీడియాతో కీలక విషయాలు వెల్లడించారు. పేలుడు ఘటన ప్రమాదమేనని స్పష్టం చేశారు. ఘటనపై అనవసరపు ఊహాగానాలు వ్యాప్తి చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రమాద ఘటనలో 9 మంది మృతి చెందినట్లు తెలిపారు. ఓ SIA, ముగ్గురు FSL, ఇద్దరు ఫొటోగ్రాఫర్లు, ఇద్దరు రెవెన్యూ అధికారులు, ఓ దర్జీ చనిపోయినట్లు చెప్పారు. మరో 27 మంది గాయపడ్డట్లు పేర్కొన్నారు.
- Advertisement -



