నవతెలంగాణ-హైదరాబాద్: వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఇవాళ రెండు కీలక బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే పలు బిల్లులకు ఎలాంటి చర్చలు లేకుండానే ఆమోదం లభించిన విషయం తెలిసిందే. తాజాగా జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లుతోపాటు తీవ్రమైన నేరాల విషయంలో పీఎం, సీఎం మంత్రుల తొలగింపునకు సంబంధించి మరో రెండు బిల్లును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది.
బుదవారం లోక్ సభలో జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లును హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లును ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈనెల 20న ప్రవేశపెట్టే బిల్లు ద్వారా జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్దరిస్తారన్న వార్తులు జోరందుకున్నప్పటికీ దీనిపై కేంద్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన సానకూల పరిణామం చోటుచేసుకుంటుందని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఇటీవల ఆశాభావం వ్యక్తం చేశారు. 2019లో ఆర్టికల్ 370 రద్దుతో పాటు జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే.
తీవ్రమైన నేరాలకు పాల్పడి అరెస్టయితే ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించేలా బిల్లును బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. ఐదేళ్లు అంతకంటే ఎక్కువ శిక్షపడే తీవ్ర నేరాలకు పాల్పడి, అరెస్ట్‌యి వరసగా 30 రోజులపాటు కస్టడీలో ఉన్న సందర్భారల్లో ఆయా నేతలను పదవి నుంచి తొలగించేందుకు ఈ మూడు బిల్లులను తీసుకొస్తున్నారు.
ఈ మేరకే గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్(సవరణ)బిల్లు, 2025-రాజ్యాంగం (130వ సవరణ)బిల్లు, 2025-జమ్మూకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ(సవరణ),బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. బుధవారం వీటిని లోక్‌సభ ముందుకు తీసుకొచ్చాక పార్లమెంట్ సంయుక్త కమిటీకి సిఫార్సు చేసే తీర్మానాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రవేశపెడతారు. ప్రస్తుతమున్న కేంద్రపాలిత ప్రాంతాల చట్టం, 1963లో ముఖ్యమంత్రి, మంత్రిని పదవి నుంచి తొలగించే ఏ నిబంధనా లేదు. అలాగే ఇతర చట్టాల్లోనూ, ప్రధాని, కేంద్ర మంత్రులను తొలగించే నిబంధనలు లేవు.