సూపర్‌స్టార్ కష్ణ జయంతి సందర్భంగా ‘జటాధర’ చిత్ర యూనిట్ ఈ ఐకానిక్ యాక్టర్‌కు హదయపూర్వకంగా నివాళి అర్పించింది. కష్ణ తిరుగులేని చరిష్మా, లార్జర్ దేన్ లైఫ్ స్క్రీన్ ప్రెజన్స్ టీమ్‌కి స్ఫూర్తినందిస్తూ వారికి సజనాత్మకతంగా ముందుకు వెళ్లటానికి తోడ్పాడునందిస్తోంది. తెలుగు వెండితెరపై దేవుడికి, తుపానుగా సినిమా ప్రపంచంలో శాశ్వతమైన ప్రభావితాన్ని చూపించిన శక్తిగా లెజెండీ యాక్టర్ సూపర్‌స్టార్ కష్ణను ‘జటాధర’ చిత్రయూనిట్ స్మరించుకుంది. తమ కథలను ఈ ప్రపంచానికి అందించటానికి కషి చేస్తోన్న ఈ జట్టుకు ఆయన చూపిన దారి మార్గదర్శకత్వంగా నిలుస్తోంది. ‘హ్యాపీ బర్త్‌డే టు ది కింగ్ ఆఫ్ చర్మిష్మా’ అంటూ సినీ పరిశ్రమపై ఆ లెజెండ్రీ నటుడి చిరస్మరణీయ ప్రభావాన్ని శ్లాఘించింది. ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘జటాధర’ సినిమా షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ సినిమా నటీనటులు, టెక్నీషియన్స్ సినీ ప్రయాణంలో మైల్‌స్టోన్ మూవీగా నిలిచిపోనుంది. పాన్ ఇండియా మూవీగా సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా ‘జటాధర’ను తెలుగు, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. సోనాక్షి సిన్హా, సుధీర్ బాబు, శిల్పా శిరోద్కర్, రవి ప్రకాష్, ఇంద్ర కష్ణ, నవీన్ నేని, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, ఝాన్సి నటిస్తోన్న ఈ చిత్రాన్ని ప్రేరణ అరోరా, శివన్ నారంగ్, అరుణ అగర్వాల్ నిర్మిస్తున్నారు. అక్షరు క్రేజీవాల్, కుస్సుమ్ అరోరా సహ నిర్మాతలుగా, దివ్యా విజరు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా, భవానీ గోస్వామి సూపర్‌వైజింగ్ ప్రొడ్యూసర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ప్రారంభించింది. అభిమానులు, ప్రేక్షకులకు ఈ సినిమా ఓ గొప్ప అనుభూతినిచ్చేలా రూపొందుతోంది అని చిత్ర యూనిట్ తెలిపింది.