Monday, August 4, 2025
E-PAPER
Homeసినిమాదేశవ్యాప్తంగా జేజేలు..పలుకుతున్నారు

దేశవ్యాప్తంగా జేజేలు..పలుకుతున్నారు

- Advertisement -

హౌంబాలే ఫిల్మ్స్‌ సమర్పణలో క్లీమ్‌ ప్రొడక్షన్స్‌ నిర్మించిన చిత్రం ‘మహావతార్‌ నరసింహ’. అశ్విన్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. శిల్పా ధావన్‌, కుశాల్‌ దేశారు చైతన్య దేశారు నిర్మించారు.
గీతా ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా జూలై 25న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని అందుకుంది. భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్‌ సినిమాగా రికార్డ్‌ క్రియేట్‌ చేసి, సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతుంది.
ఈ సందర్భంగా మేకర్స్‌ నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో నిర్మాత అల్లు అరవింద్‌ మాట్లాడుతూ,’హౌంబలే ఫిల్మ్స్‌ సంస్థతో నాకు మంచి అనుబంధం ఉంది. నిర్మాత విజరు ఫోన్‌ చేసి, ఈ సినిమాని తెలుగులో మీరు విడుదల చేయాలని అని అడిగారు. అంతకుమించి ఏం మాట్లాడుకోలేదు. వెంటనే ఓకే అన్నాను. సినిమా విడుదలైన రోజు మార్నింగ్‌ షోకి వచ్చిన రెస్పాన్స్‌ని దష్టిలో పెట్టుకుని ఈవెనింగ్‌ కొన్ని షోస్‌ పెంచాం. మరుసటి రోజు నుంచి మరిన్ని స్క్రీన్స్‌ పెంచుకుంటూ వెళుతున్నాం. భారతదేశం అంతటా ప్రేక్షకులు ఈ సినిమాకి జేజేలు పలుకుతున్నారు. హైదరాబాద్‌లోని ఏఎంబీలో 200 మంది స్వాములు ఈ చిత్రాన్ని చూశారు. ఎప్పుడూ థియేటర్స్‌ రాని ప్రేక్షకులు ఈ సినిమాని వీక్షిస్తున్నారు. సినిమా చూసిన ప్రేక్షకులు ఉద్వేగంతో తమ తోటివారితో సినిమా గురించి గొప్పగా చెబుతున్నారు. మా కుటుంబం, సన్నిహితులు, పరిచయం ఉన్నవారందరిలో సనాతన ధర్మం గురించి పవన్‌ కల్యాణ్‌కి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ఆయన సనాతన ధర్మం గురించి ప్రసంగిస్తే అందరూ ముగ్ధులవుతాం. ఈ చిత్రాన్ని ఆయన చూడాలని, దాని గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, తనికెళ్ల భరణి, డైరెక్టర్‌ అశ్విన్‌ కుమార్‌, ప్రొడ్యూసర్‌ శిల్పా ధావన్‌ తదితరులు ఈ సక్సెస్‌మీట్‌లో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -