Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్తెలంగాణ చరిత్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అంకం జయప్రకాశ్

తెలంగాణ చరిత్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అంకం జయప్రకాశ్

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి: తెలంగాణ చరిత్ర పరిశోధనలో ముఖ్య భూమిక పోషిస్తున్న తెలంగాణ చరిత్ర కాంగ్రెస్ కు కామారెడ్డిలోని  ప్రభుత్వ ఆర్ట్స్ , సైన్స్ కళాశాలలో చరిత్ర అధ్యాపకులుగా పని చేస్తున్న  అంకం జయప్రకాశ్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారనీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  తెలంగాణ చరిత్ర పరిశోధనకు ప్రోత్సాహం ఇవ్వడం, చారిత్రక విశ్లేషణకు మార్గనిర్దేశం చేయడం, చరిత్ర రచనలోని వాస్తవాలను పరిరక్షించడం వంటి విషయాలలో తెలంగాణ చరిత్ర కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు. తెలంగాణ చరిత్రపై శాస్త్రీయ పరిశోధనను ప్రోత్సహిస్తూ, చరిత్ర రచనను వాస్తవ ఆధారంగా కొనసాగించడం చరిత్ర కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా తెలంగాణలోని భిన్న మతాలు, జాతులు, సామాజిక వర్గాల చరిత్రను సమానంగా ప్రాధాన్యంతో పరిశీలిస్తూ, చరిత్ర రచనలో వక్రీకరణను నిరోధించడం  చరిత్ర కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం. అదేసమయంలో చరిత్రను ప్రజలకు సరళంగా అందుబాటులోకి తేవడానికి కూడా టిహెచ్ సి కృషి చేస్తుంది. ప్రతీ సంవత్సరం రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో, కళాశాలలో సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సమావేశాల్లో పరిశోధకులు తమ పరిశోధన పత్రాలు సమర్పిస్తారు. భారతదేశంలోని ప్రముఖమైన చరిత్రకారుల సంఘమైన ఈ కాంగ్రెసుకు ప్రధాన కార్యదర్శిగా అంకం జయప్రకాశ్ నియమితులు కావడం పట్ల కళాశాల అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img