Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఆ మూడు దేశాల్లో ప‌ర్య‌టించ‌నున్న జయశంకర్

ఆ మూడు దేశాల్లో ప‌ర్య‌టించ‌నున్న జయశంకర్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జయశంకర్ ప‌లు దేశాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. మే 19-24 మధ్య నెదర్లాండ్స్‌, డెన్మార్క్‌, జర్మనీ దేశాల‌ను సందర్శించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. విదేశాంగ మంత్రి మూడు దేశాల అధ్యక్షులతో సమావేశమవుతారని, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుపుతారని పేర్కొంది. పరస్పర ఆసక్తి ఉన్న ప్రపంచ, ప్రాంతీయ విషయాలపై కూడా చర్చలు జరుపుతారని తెలిపింది. ఈ ఏడాది మేలో జర్మనీ కొత్త ఫెడరల్‌ చాన్సలర్‌గా ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌ పదవీ బాధ్యతలు చేపట్టిన సమయంలో భారత ప్రధాని మోడీ తరపున విదేశాంగ మంత్రి అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img