Wednesday, September 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తెలంగాణ కోసం జయశంకర్ అలుపెరగని పోరాటం..

తెలంగాణ కోసం జయశంకర్ అలుపెరగని పోరాటం..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం 60 ఏళ్లు అలుపెరగని పోరాటం చెసిన గొప్ప మహనీయుడు ప్రొపెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని పెద్దతూండ్ల, తాడిచర్ల గ్రామాల్లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తిరుపతి, సిహెచ్ తిరుపతి అన్నారు. జయశంకర్ సార్ జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం పాఠశాలల్లో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించి, ఆయన చిత్రపాఠాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు తెలంగాణ సాకారం కోసం జీవితాంతం పోరాడి తెలంగాణ జాతిపితగా నిలిచారని తెలిపారు. విద్యార్థులు జయశంకర్ సార్ ను స్ఫూర్తిగా తీసుకొని బాగా చదవాలని ప్రధానోపాధ్యాయులు కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -