- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్ష తేదీలను ప్రకటించారు. మే 17, 2026న నిర్వహించనున్నారు. ఈ పరీక్ష CBT ఆధారితంగా ఉంటుంది. రెండు పేపర్లను కలిగి ఉంటుంది. ఈ సంవత్సరం, ఐఐటీ రూర్కీ జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను నిర్వహిస్తుంది. JEE అడ్వాన్స్‌డ్ వెబ్‌సైట్ jeeadv.ac.in లో పరీక్ష గురించి సమాచారాన్ని పొందవచ్చు. పరీక్ష రెండు సెషన్లలో నిర్వహిస్తారు. పేపర్-1 ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు జరుగనుంది. JEE అడ్వాన్స్‌డ్ 2026 సిలబస్, మార్కింగ్ స్కీమ్, రిజిస్ట్రేషన్ షెడ్యూల్, పరీక్షా నగరాల వివరాలను త్వరలో విడుదల చేస్తారు.
- Advertisement -



