నవతెలంగాణ-పాలకుర్తి
టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి పుట్టినరోజు వేడుకలను సోమవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఝాన్సీ రెడ్డి పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో కలిసి కార్యకర్తలు, ఝాన్సీ రెడ్డి అభిమానులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గల రాజీవ్ చౌరస్తాలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఝాన్సీ రెడ్డికి గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యశస్విని రెడ్డి మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో ఝాన్సీ రెడ్డి ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లావుడియా మంజుల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, మండల మహిళా అధ్యక్షురాలు బండిపెళ్లి మనెమ్మ, పాలకుర్తి పట్టణ కమిటీ నాయకులు కమ్మగాని నాగన్న, వీరమనేని యాకాంతరావు, మారం శ్రీనివాస్, పెనుగొండ రమేష్, ఎడవల్లి సోమల్లయ్య, ఎండి మదర్, ఎండి నజీర్, ఎండి సలీం, ఎడవెల్లి పురుషోత్తం, నరేందర్, బిక్షపతి లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ఝాన్సీ రెడ్డి జన్మదిన వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES