దక్షిణ భారత మీడియా, వినోద పరిశ్రమలో ఒక కీలకమైన ఘట్టానికి శ్రీకారం చుట్టింది జియో హాట్ స్టార్. దక్షిణాదిలో సృజనాత్మకతను కొత్త పుంతలు తోక్కించే దిశగా జియోహాట్‌స్టార్ తన మాత సంస్థ జియోస్టార్ రాబోయే ఐదు సంవత్సరాలలో రూ.4,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్రకటించింది. చెన్నైలో మంగళవారం సాయంత్రం జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, తమిళ భాషాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎంపి స్వామినాథన్, పార్లమెంటు సభ్యులు కమల్ హాసన్, మోహన్‌లాల్, నాగార్జున ఇంకా దక్షిణాది సినీ, బుల్లితెర పరిశ్రమలకు చెందిన ప్రముఖుల సమక్షంలో ఈ విషయాన్ని వెల్లడించింది.
జియోస్టార్‌లో ఎస్‌విఓడి హెడ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సుశాంత్ శ్రీరామ్, జియోస్టార్ క్లస్టర్, ఎంటర్‌టైన్‌మెంట్ (సౌత్) హెడ్ కృష్ణన్ కుట్టి హాజరై.. భారతదేశ వినోద రంగంలో జియోహాట్‌స్టార్ తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులు గురించి, భారతీయ కథా కథనాలను మరింత విస్త్రత స్థాయిలో దక్షణాది ప్రేక్షకులకి అందించడానికి చేస్తున్న కృషి గురించి వివరించారు. ఈ సందర్భంగా 25 కొత్త టైటిల్స్‌తో కూడిన జియోహాట్‌స్టార్ బ్లాక్‌బస్టర్ సౌత్ లైనప్‌ను తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆవిష్కరించారు.
దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్లు భారీ పెట్టుబడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



