- Advertisement -
నవతెలంగాణ – నవాబు పేట
మండల కేంద్రములో నేడు రేపు జరిగే చౌడమ్మ బోనాలు, పోచమ్మ బోనాల పండుగల సందర్భంగా జేకే ట్రస్ట్ చైర్మన్ లు నర్సింహ చారి సుధాకర్ చారి ఆధ్వర్యంలో ఇంటింటికి పది రకాల సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో అందరూ భక్తిశ్రద్దలతో అమ్మవారికి బోనాలు సమర్పించాలి అనే సంకల్పంతో తమకు తోచిన విధంగా సహృదయంతో ఇంటింటికి సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది అని తెలిపారు. గ్రామానికి ఏదో ఒక రకంగా సేవ చేయాలని గ్రామదేవతల ఆశిస్సులతో మరెన్నో సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జేకే ట్రస్ట్ డైరెక్టర్ లు సభ్యులు పుట్టి అంజయ్య నిరంజన్ తదితరులు ఉన్నారు.
- Advertisement -