సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’. ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ నేషనల్ వైడ్‌గా వైరల్ అయ్యాయి. ‘సోల్ ఆఫ్ జటాధార, ధన పిశాచి’ సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. తాజాగా మేకర్స్ ‘జో లాలి జో..’ సాంగ్ రిలీజ్ చేశారు. రాజీవ్ రాజ్ ఈ పాటని అద్భుతమైన లాలి పాటగా కంపోజ్ చేశారు. శ్రీమాన్ కీర్తి లిరిక్స్, పావని వాసా, రాజీవ్ రాజ్ వోకల్స్ ఆకట్టుకున్నాయి.
ఈ చిత్రంలో దివ్య ఖోస్లా, శిల్పా శిరోధ్కర్, ఇంద్రకృష్ణ, రవి ప్రకాష్, నవీన్ నేని, రోహిత్ పాఠక్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, సుభలేఖ సుధాకర్‌తో పాటు ప్రముఖ నటులు కనిపించనున్నారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించారు. అక్షయ్ కేజ్రీవాల్, కుస్సుమ్ అరోరా సహ నిర్మాతలు. నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
‘జో లాలి జో’..
- Advertisement -
- Advertisement -



