డీవైఎఫ్‌ఐ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షలు ఎం.డి.జావీద్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ) హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరుతూ బుధవారం హైదరాబాద్‌లోని చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా జావీద్ మాట్లాడుతూ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో నిరుద్యో గులందరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామనీ, జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలను భర్తీ చేస్తామని యూత్ డిక్లరేషన్‌ను ప్రక టించిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్‌ను నామమాత్రంగా ప్రకటించి, దాని ప్రకారం ఏ ఒక్క నోటిఫికేషన్ వేయలేదని విమర్శించారు. సమగ్రమైన వివరాలు, పూర్తి సమాచారం తో జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలనీ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేంత వరకు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి రూ.4,000 ఇవ్వాలని కోరారు. రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తులు స్వీకరించి రుణాలను మంజూరు చేయలేదని విమర్శించారు. అర్హులైన నిరుద్యోగులకు ఉపాధి కోసం వెంటనే రుణాలు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దేవేందర్, రాజు, నాయకులు బాలకోటి, నరేష్, రాము తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగ యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



