నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
స్థానిక గిరిరాజ్ కళాశాలలో టి ఎస్ కే సి ఆధ్వర్యంలో కాకతీయ సాండ్ బాక్స్, దేశ్ పాండే ఫౌండేషన్ సౌజన్యంతో జెన్సాక్ట్ కంపెనీలో వివిధ ఉద్యోగాలకై శుక్రవారం జాబ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ ప్రారంభ సదస్సుకు అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ డాక్టర్ పి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కళాశాల విద్యార్థులకు విద్యతో పాటుగా అనేక నైపుణ్యాలలో శిక్షణ ఇస్తూ, వాటికి అనుగుణమైన ఉద్యోగాలకై ప్రాంగణ నియమకాలను కూడా టి ఎస్ కే సి చేపడుతుందని అని తెలియజేశారు. డ్రైవ్ లో పాల్గొన్న విద్యార్ధులందరు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రోత్సాహపర్చారు.
2024 , అంతకు మునుపు డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఈ జాబ్ డ్రైవ్ లో అవకాశం కలిగించారని, జిల్లా నలుమూలల నుండి సుమారు 250 మంది ఉద్యోగార్థులు ఈ డ్రైవ్ లో పాల్గొన్నారు. వీరిలో 112 మంది తదుపరి రౌండ్లకై ఎంపికయ్యారని టి ఎస్ కే సి సమన్వయకర్త డా. పి. రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు డా. దండు స్వామి, లె. డా. రామస్వామి, టీఎస్ కే సి మెంటార్ శ్రీకాంత్, దేశ్ పాండే ఫౌండేషన్ ప్రతినిధులు రాజేంద్ర, యశ్మిత, సాయి ప్రియ, శ్రీకాంత్ మరియు జెన్పాక్ట్ సంస్థ హెచ్ఎర్లు తదితరులు పాల్గొన్నారు.