Thursday, January 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎన్ఎస్ఎస్, ప్రథమ్ సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా 

ఎన్ఎస్ఎస్, ప్రథమ్ సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా 

- Advertisement -

నవతెలంగాణ – నెల్లికుదురు 
ఈనెల 9వ తదీన ప్రథమ్ సంస్థ, ఎన్ఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ఎస్ ఎస్ సి, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ చదువుకున్న వాళ్లు లేదా ఫెయిల్ ఐనటువంటి యువతీ, యువకుల కోసం జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని ఆ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ భూక్యా స్రవంతి, ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఎన్ఎస్ఎస్ జిల్లా కన్వీనర్ మర్సకట్ల అనిల్ కుమార్ లు అన్నారు. బుధవారం వారు మాట్లాడుతూ.. యువతకు తామే శిక్షణ ఇచ్చి జాబు లోకి చేర్చుకోవడం జరుగుతుందని అన్నారు. కావున విద్యార్థులు అందరూ ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని, వచ్చేటప్పుడు విద్యార్థులు రీజం (Resume) & ఐడి ప్రూఫ్ లు తీసుకోనిరావాలని  అన్నారు. మరిన్ని వివరాలకు 9063484855, 9704007721,9958525990 లకు సంప్రదించగలరు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు లడే మహేందర్, శ్రీనివాస్, యాకన్న, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -