ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 384/10
యాషెస్ సిరీస్ ఆఖరు టెస్టు
సిడ్నీ (ఆస్ట్రేలియా) : ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (160, 242 బంతుల్లో 15 ఫోర్లు) కెరీర్ 41వ టెస్టు సెంచరీతో చెలరేగాడు. ఓవర్‌నైట్ స్కోరు 72తో రెండో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన జో రూట్ 11 ఫోర్లతో 146 బంతుల్లో సెంచరీ సాధించాడు. యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (84, 97 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి నాల్గో వికెట్‌కు 209 బంతుల్లో 169 పరుగులు జోడించి ఇంగ్లాండ్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ (0) నిరాశపరిచినా.. జెమీ స్మిత్ (46, 76 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), విల్ జాక్స్ (27, 62 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్)తో జో రూట్ వరుసగా 94, 52 పరుగుల కీలక భాగస్వామ్యాలు నిర్మించాడు. మైకల్ నెసర్ ఓవర్లో రూట్ రిటర్న్ క్యాచ్‌తో నిష్క్రమించగా ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ కథ ముగింపుకు చేరుకుంది.
97.3 ఓవర్లలో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 384 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో మైకల్ నెసర్ (4/60), మిచెల్ స్టార్క్ (2/93), స్కాట్ బొలాండ్ (2/85) రాణించారు. రెండో రోజు ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 34.1 ఓవర్లలో 166/2 పరుగులు చేసింది. ఓపెనర్ ట్రావిశ్ హెడ్ (91 నాటౌట్, 87 బంతుల్లో 15 ఫోర్లు) తనదైన శైలిలో దంచికొట్టగా.. మార్నస్ లబుషేన్ (48, 68 బంతుల్లో 7 ఫోర్లు) రాణించాడు. జేక్ వెథర్‌లాండ్ (21) తొలి వికెట్‌కు 57 పరుగులు జోడించినా ఎంతో సేపు వికెట్ నిలుపుకోలేదు. నైట్‌వాచ్‌మన్ మైకల్ నెసర్ (1 నాటౌట్)తో కలిసి హెడ్ అజేయంగా క్రీజులో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ (2/30) రెండు వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో మరో 218 పరుగుల వెనుకంజలో నిలిచింది.



