నవతెలంగాణ – గోవిందరావుపేట : స్థానిక పంచాయతీ సంస్థల ఎన్నికల్లో గోవిందరావుపేట పంచాయతీ నుండి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి లావుడియా జోగనాయక్ ఇంటింటి ప్రచారం జోరుగా కొనసాగుతోంది. సోమవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి లావుడియా జోగా నాయక్ కత్తెర గుర్తుకు ఓటేయ్యాలని ఇంటింటికి, గడప, గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లావుడియా జోగా నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యం అని, పంచాయితీరాజ్ మంత్రిగా సీతక్క ఉండడం వలన గ్రామానికి భారీగా నిధులు తెచ్చి, గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని, గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే గ్రామాన్ని అభివృద్ధి చేసింది లేదని, ఇప్పుడు వారు ప్రతిపక్షంలో ఉండి అభివృద్ధి ఏం చేస్తారు అని అన్నారు. అలాగే గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మొదటి విడతగా 80 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసింది అని, ఇంకా 200 ఇండ్లు మంజూరు చేస్త అని మంత్రి సీతక్క మాట ఇచ్చారని, ఇల్లు నిరుపేదలకు ఇండ్లు పెట్టించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని అన్నారు.
అలాగే గతంలో నా భార్య అయిన లక్ష్మి సర్పంచిగా ఉన్న సమయంలో కూడా మేము అందరితో కలిసి మెలిసి ఉన్నాం అని, అందరితో సర్పంచిగా కాకుండా వాళ్ళ మనిషిలా ఉండేవాడిని, ఇప్పుడు కూడా అలాగే ఉంటానని, పదవులు వస్తె మారే స్వభావం నాది కాదని, కానీ పదవులు వస్తె మారే వారిని ఎన్నుకుంటే గ్రామ పంచాయతీ గేటు కూడా దాటలేం అని అన్నారు. అలాగే నేను చదువుకోలేదు చిన్నప్పటి నుండి వ్యవసాయం చేసుకుంటూ బ్రతికిన కానీ, ఏ రోజు ఎలాంటి దొంగ వ్యాపారాలు చేయలేదు, కావాలని పదవుల కోసం అసత్య ప్రచారాలు చేస్తున్నారు. నాకు చదువు రాదు అని, చదువుకోలేదు అని అవహేళన చేస్తున్నారు. అయిన భరిస్తున్న అని, రాజకీయం అనేది సేవ, సేవ చేయాలంటే చదువు అవసరం లేదు, అలాగే పదవులు చేయాలంటే గ్రామ సమస్యల గురించి అవగాహన ఉంటే చాలు అని అంతేకాని చదువు లేదు, అక్షర జ్ఞానం లేదని, హేళన చేయడం సబబు కాదని, ఎవరైనా రైతు కంటే ఎక్కువ చదువుకున్నావారు. లేరని తెలుసుకోవాలి అని అన్నారు. ఇవ్వాళ పదవులు రాకముందే చదువు ఉన్నవారు లేనివారు అని వేరు చేసి మాట్లాడుతున్నారు. రేపు చదువు లేని వారిని, రైతులను గ్రామ పంచాయతీ లోపలికి కూడా రానివ్వరేమో ఇప్పటికీ అయిన మీ అందరితో కలుపుగోలుగా ఉంటూ, మీ మనిషిలా మీ మధ్యల బ్రతుకుతున్న నా యొక్క కత్తెర గుర్తుకు ఓటు వేసి, అభివృద్ధికి బాటలు వేయండి అని గోవిందరావుపేట గ్రామ ప్రజలను వేడుకుంటూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ, ములుగు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మద్దాలి నాగమణి, గ్రామ అధ్యక్షులు రామచంద్రపు వెంకటేశ్వర రావు గార్లతో పాటుగా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా, మండల నాయకులు అందరూ పాల్గొన్నారు.



