- Advertisement -
నవతెలంగాణ -హైదరాబాద్: లాస్‌ఏంజెలెస్‌లో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి భారీ జరిమానా పడింది. వారి బేబీ పౌడర్ ఉత్పత్తుల వల్ల క్యాన్సర్ (మెసోథెలియోమా) వచ్చి మే మూర్ అనే 88 ఏళ్ల వయస్సు గల మహిళ 2021లో మరణించిందని ఆమె కుటుంబీకులు గత ఏడాది దావా వేశారు. దీంతో ఆమె కుటుంబానికి 966 మిలియన్ డాలర్లు (8,577 కోట్ల రూపాయలు) పరిహారం చెల్లించాలని లాస్ ఏంజెలెస్ జూరీ ఆదేశించింది. ఈ తీర్పుపై ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు.
- Advertisement -