- Advertisement -
నవతెలంగాణ – మిర్యాలగూడ
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనకు ఆకర్షతులై వేములపల్లి మండలంలోని రావులపెంట గ్రామ శాఖ అధ్యక్షులు నల్ల మేకల నర్సయ్య ఆధ్వర్యంలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి అందిస్తున్న సేవలను నచ్చి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ పేదల పక్షాన పనిచేస్తుందని అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం లోనే న్యాయం జరుగుతుందని చెప్పారు. స్వచ్ఛందంగా పార్టీలోకి వస్తున్న కార్యకర్తలకు భవిష్యత్తులో సముచితస్థానం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



