నవతెలంగాణ – గంభీరావుపేట: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ లో చేరుతున్నారని బీజేపీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి అన్నారు.శుక్రవారం గంభీరావుపేట బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి దుర్గేష్ ఆధ్యర్వంలో ముచ్చర్ల గ్రామానికి చెందిన సర్పంచి అభ్యర్థి కుంట కనకయ్యతో పాటు పలువురు బీజేపీ పార్టీ లో చేరారు.ఈ సందర్బంగా రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలనీ, గ్రామాలు అభివృద్ధి చెందాలంటే బీజేపీ తోనే సాధ్యమన్నారు.పార్టీ లో చేరిన వారిలో కుంట లచ్చయ్య,నిఖిల్ తో పాటు పలువురు ఉన్నారు. ఆనంతరం పెద్ద ఎత్తున జనం తో వెళ్లి కొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ వేశారు.ఈ కార్యక్రమంలో ఆవునూరి శ్రీనివాస్,బోనకొండ నవీన్, అవునూరి అశోక్, నిఖిల్,కృష్ణ,మహిళలు తదితరులు పాల్గొన్నారు.



