Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుముగిసిన జర్నలిస్ట్ బ్యాడ్మింటన్ పోటీలు..

ముగిసిన జర్నలిస్ట్ బ్యాడ్మింటన్ పోటీలు..

- Advertisement -

విజేతలుగా నిలిచిన కోర్న సందీప్, బైర శ్రీకాంత్..
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్ట్ బ్యాడ్మింటన్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. క్రీడలలో భాగంగా సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆఫీసర్స్ క్లబ్ లో జర్నలిస్టులకు బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంతడ్పుల రామకృష్ణ ప్రారంభించారు. అనంతరం జరిగిన పోటీలలో కోర్న సందీప్, బైరా శ్రీకాంత్ ల జట్టు ఫైనల్ మ్యాచ్లో రాజలింగం, దశరత్ లతో తలపడ్డారు. హోరా హోరిగా జరిగిన బెస్ట్ ఆఫ్ త్రీ ఫైనల్ మ్యాచ్లో 2-1 తేడాతో సందీప్, శ్రీకాంత్ ల జట్టు విజయం సాధించి బ్యాడ్మింటన్ విజేతలుగా నిలిచారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి ఈ నెల 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం రోజు బహుమతులు ప్రధానం చేయనున్నారు. ఈ పోటీలకు ఆర్గనైజర్లుగా జైపాల్, శ్రీనివాస్ లు వ్యవహరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img