Thursday, December 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

- Advertisement -

టీయూడబ్ల్యూజే నాయకులు
ఐ అండ్‌ పీఆర్‌ కార్యాలయం ఎదుట ధర్నా


నవతెలంగాణ-మెహిదీపట్నం
పన్నెండేండ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో హైదరాబాద్‌ మాసబ్‌ ట్యాంక్‌లోని ఇన్ఫర్మేషన్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు విరహత్‌ అలీ మాట్లాడుతూ.. ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. అక్రెడిటేషన్‌ కార్డుల పునరుద్ధరణలో జాప్యం, కొత్త కార్డుల జారీ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అర్హులైన విలేకరులకు ఇండ్ల స్థలాలు, హెల్త్‌ కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని, జర్నలిస్టులపై జరిగే దాడులకు వ్యతిరేకంగా ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వం ఇప్పటికైనా విలేకరుల సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో యూనియన్‌ ప్రధాన కార్యదర్శి రాంనారాయణ, ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్‌, ఎంఏ. మాజీద్‌, చిన్న పత్రికల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యూసుఫ్‌ బాబు, హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షప్రధాన కార్యదర్శులు విజరు కుమార్‌రెడ్డి, రమేష్‌, ఉపాధ్యక్షులు ఏ.రాజేష్‌, ఫొటో జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షప్రధాన కార్యదర్శులు గంగాధర్‌, కెఎన్‌.హరి, వీడియో జర్నలిస్టుల సంఘం అధ్యక్షప్రధాన కార్యదర్శులు నాగరాజు, హరీష్‌, హెచ్‌యూజే అధ్యక్షులు శిగా శంకర్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -