Saturday, July 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఆమోదం పట్ల హర్షం

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఆమోదం పట్ల హర్షం

- Advertisement -

కాంగ్రెస్ వర్గాల్లో సంబురాలు 
నవతెలంగాణ – వనపర్తి 
: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ క్యాబినేట్ ఆమోదం తెలపడంతో కాంగ్రెస్ వర్గాల్లో సంబరాలు నిన్నంటాయి. వనపర్తి జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో పట్టణ కాంగ్రెస్ కమిటీ  ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు శుక్రవారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వనపర్తి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చీరల విజయ్ చందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి లక్కాకుల సతీష్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా చేయలేని బీసీల రిజర్వేషన్ తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎంతో శ్రమించారని, ఎవరూ చేయలేని త్యాగం చేశారని కొనియాడారు.

ఎస్సీ, బీసీల రిజర్వేషన్లు తేల్చడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరో ముందడుగు వేసిందని భావిస్తున్నామని తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రిజర్వేషన్ల అమలులో రోల్ మోడల్ గా నిలబడనుందని తెలిపారు. ఆ క్రెడిట్ అంతా కేవలం సీఎం రేవంత్ రెడ్డికి, క్యాబినెట్ కు మాత్రమే దక్కుతుందని పేర్కొన్నారు. వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఆదేశాల మేరకు సామంతా పని చేస్తున్నామని, బీసీల ఐక్యతతో రాబోయే ఎన్నికల్లో సత్తా చాటుతామని తెలిపారు. అనంతరం నాయకులకు కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వనపర్తి పట్టణ అధ్యక్షులు పిసిసి సభ్యులు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ వైస్ చైర్మన్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళ సోషల్ మీడియా యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ, సేవాదళ్, ఐ ఎన్ టి యు సి, వర్క్స్ బోర్డ్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -