- ₹11 కోట్ల విలువైన హామీ బహుమతులు గెలుచుకునే అవకాశం
- ఇద్దరికి లండన్‌కు కలల యాత్రను గెలుచుకునే అవకాశం
- అర్హత కలిగిన కొనుగోళ్లపై 3 రోజులు / 2 రాత్రులు సెలవు వోచర్ హామీ
- కస్టమర్ల కోసం గాడ్జెట్‌లు , జీవనశైలి బహుమతులతో సహా స్క్రాచ్-అండ్-విన్ రివార్డులు
- మిడ్‌నైట్ కార్నివాల్ కాలంలో MG పోర్ట్‌ఫోలియోలో ఆకర్షణీయమైన ప్రయోజనాలు, ఫైనాన్స్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.
- ప్రత్యేకమైన అర్ధరాత్రి టెస్ట్ డ్రైవ్‌లు
నవతెలంగాణ హైదరాబాద్: వృద్ధి, కస్టమర్ల నమ్మకంతో కూడిన విజయవంతమైన సంవత్సరాన్ని సూచిస్తూ, JSW MG మోటార్ ఇండియా తన మొత్తం వాహన శ్రేణిపై దేశవ్యాప్తంగా‘మిడ్‌నైట్ కార్నివల్’ ప్రచారాన్ని డిసెంబర్ 5–7 మధ్య నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మూడు రోజులు అన్ని MG షోరూమ్‌లు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటాయి. దీంతో, కస్టమర్‌లు తమ ఇష్టమైన MG వాహనాలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పరిశీలించేందుకు మరింత సమయం, మరింత సౌకర్యం లభిస్తుంది. పండగ వాతావరణం, కార్నివల్ తరహా అనుభవంతో కూడిన ప్రత్యేక అవకాశంగా మారుతుంది.
మిడ్‌నైట్ కార్నివల్ JSW MG మోటార్ ఇండియా తమ ప్రయాణంలో కస్టమర్‌లను కేంద్ర భాగంగా మార్చే దృష్టిని మరింతగా తెలియజేస్తోంది. ఇది చిరస్మరణీయ యాజమాన్య అనుభవాలతో ఉత్పత్తి ఆవిష్కరణలను మిళితం చేసి, బ్రాండ్ కారు కొనుగోలు ఆనందభరితమైన, కుటుంబానికి అనుకూలమైన వేడుకలు మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. షోరూం సమయాలను పొడిగించడం, డీలర్‌షిప్‌లో ఆకర్షణీయమైన కార్యకలాపాలను ఏర్పాటు చేయడం ద్వారా, కస్టమర్‌ల అనుభవాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తోంది.
JSW MG మోటార్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వినయ్ రైనా మాట్లాడుతూ “JSW MG మోటార్ ఇండియాలో, మేము కేవలం కార్లను మాత్రమే కాదు. అనుభవాలను సృష్టించడానికే ప్రాధాన్యం ఇస్తాం. ఈ సంవత్సరం మా బ్రాండ్‌పై కస్టమర్ల ప్రేమ , నమ్మకం ఎంతగానో పెరిగింది ఇది నిరూపించింది. మిడ్‌నైట్ కార్నివల్ ద్వారా, ఈ కాలంలో తమ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించే ప్రతి ఒక్కరికీ మా తరఫున ఒక ప్రత్యేక కానుక అందిస్తూ, ధన్యవాదాలు చెప్పడం, మా పెరుగుతున్న సమాజంలో ఆనందాన్ని పంచడం మా లక్ష్యం.“ అని అన్నారు.
మిడ్‌నైట్ కార్నివల్‌లో భాగంగా, కస్టమర్‌లకు మొత్తం ₹11 కోట్ల విలువైన హామీ రివార్డులు లభిస్తాయి. ఇందులో లండన్‌కు డ్రీమ్ ట్రిప్ గెలుచుకునే అవకాశం, హామీగా లభించే 3 రోజులు/2 రాత్రుల హాలిడే వౌచర్లు, అలాగే అర్హత కలిగిన కస్టమర్‌లకు గ్యాడ్జెట్లు, లైఫ్‌స్టైల్ గిఫ్ట్‌లు వంటి స్క్రాచ్-అండ్-విన్ బహుమతులు ఉంటాయి. అంతేకాకుండా, కస్టమర్లు ఆకర్షణీయమైన ఫైనాన్షియల్ ఆప్షన్లను కూడా పొందవచ్చు. అందులో 3 నెలల ఇ.ఎం.ఐ. హాలిడే, 100% ఆన్-రోడ్ ఫైనాన్స్/ సంవత్సరాలు/ టెన్యూర్‌తో లోన్ సదుపాయం ఉంది.
భారతదేశంలో ప్రవేశించిన తర్వాత నుంచి, JSW MG మోటార్ ఇండియా వివిధ రకాల వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, ఆధునిక సాంకేతికత, భద్రత, సమకాలీన డిజైన్‌లను కలిపిన బలమైన , విభిన్న ఉత్పత్తి శ్రేణిని అభివృద్ధి చేసింది. MG విండ్సర్ ఇప్పటికీ అత్యంత వేగంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ వాహనంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 50,000 యూనిట్లు అమ్ముడవడం ద్వారా, భారత రహదారులపై MG మొత్తం EVల సంఖ్య లక్ష మార్క్‌ను దాటేందుకు ఇది సహాయపడింది. ఇదే విధంగా, హెక్టర్, ఆస్టర్, కోమెట్, ZS, గ్లోస్టర్ వంటి EV, ICE విభాగాల్లోని మోడళ్లు కూడా భారతీయ కుటుంబాలకు అనువైన కనెక్టెడ్, సౌకర్యవంతమైన, సురక్షిత మొబిలిటీ పరిష్కారాలను అందించడంలో MGను భవిష్యత్‌కు సిద్ధమైన బ్రాండ్‌గా మరింత బలపరుస్తాయి.



