Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్తుది దశకు చేరుకున్న జుక్కల్ బస్టాండ్ వాష్ రూమ్స్

తుది దశకు చేరుకున్న జుక్కల్ బస్టాండ్ వాష్ రూమ్స్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలో గత కొన్ని దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న మోడ్రన్ టాయిలెట్లు అసంపూర్తిగా నిర్మించి వదిలివేయడంతో మహిళ ప్రయాణికులకు వాష్ రూమ్ వెళ్లాలంటే ఏదైనా పొదల చాటున వెళ్లే దుస్థితి నెలకొని ఉండేది. దీని గురించి పత్రికల్లో ప్రచురించడంతో వెంటనే స్పందించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వెంటనే మరమ్మతులు చేసి అసంపూర్తిగా ఉన్న వాష్ రూమ్ ను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ప్రారంభించిన పనులు తుది దశకు చేరుకున్నాయి.

వాష్ రూమ్ లను త్వరలోనే ప్రారంభిస్తామని అధికారులు తెలియజేశారు. అదేవిధంగా పాత బస్టాండ్ ను కూడా కూల్చివేసి నూతనంగా నిర్మాణం చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. ఇటీవలే మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన  రేషన్ కార్డుల పంపిణీ  కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీలను ప్రజలు గుర్తు చేసుకున్నారు. నియోజకవర్గంలో ప్రజల ఉపయోగార్థం ఎంతటి కఠినమైన పనినైనా పూర్తి చేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే పనిచేస్తున్నారని, ‘జనం మెచ్చిన నేత ఎమ్మెల్యే తోట` అని పలువురు ప్రశంసిస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img