నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని గ్రామాలలో గురువారం నుండి అమ్మ తల్లి టీకాలను పసి వైద్య శాఖ ఆధ్వర్యంలో టీకాలు వేయించే కార్యక్రమం జుక్కల్ సర్పంచ్ కర్రెవారి సావిత్రిబాయి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. మండలంలోని 30 గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామాలలో తప్పకుండా అమ్మ తల్లి టీకాలను పశువులకు ఇప్పించాలని సూచించారు. జుక్కల్ పసి వైద్యాధికారి పండరి మాట్లాడుతూ.. గ్రామాలలోని పశువులు అనారోగ్యం పాలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఎనిమిదవ తేదీ జనవరి నుండి ఈనెల 22 వరకు గ్రామాలలో పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో అమ్మ తల్లి టీకాలు వేయడం జరుగుతుందని తెలిపారు. పాడి రైతులు తప్పకుండా అమ్మ తల్లి టీకాలను పశువులకు వేయించాలని తెలిపారు.ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ సర్పంచ్ సావిత్ర తో పాటు జుక్కల్ పశువైద్యాధికారి పండరి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కర్రి వారి సాయ గౌడ్, పశు వైద్య సిబ్బంది, గోపాలమిత్రులు తదితరులు పాల్గొన్నారు.
అమ్మ తల్లి టీకాలను ప్రారంభించిన జుక్కల్ సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



