Friday, March 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆవుల దొంగలను పట్టుకునే వరకు దీక్ష విరమించేది లేదు: జుక్కల్ గ్రామస్తులు

ఆవుల దొంగలను పట్టుకునే వరకు దీక్ష విరమించేది లేదు: జుక్కల్ గ్రామస్తులు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్

మండల కేంద్రంలోని దేవాలయ సంబంధిత రూ.90 వేలు విలువైన పలు ఆవులు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అపరించడం అంతపట్టని రహస్యమని గ్రామస్తులు ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు గత నెల రోజులు నుండి ఇప్పటివరకు దుండగులను పట్టుకో లేకపోయారని విమర్శించారు. నిరసనగా జుక్కల్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని దీక్షకు పూనుకున్నారు. నేటితో మూడవ రోజు దీక్షకు చేరుకుంది. ఇప్పటికైనా గ్రామస్తులకు సమస్యలను పట్టించుకోని దేవాలయానికి సంబంధించిన విలువైన పశుసంపదను ఎత్తుకెళ్లిన దుండగులను , దొంగలను గుర్తించి పట్టుకొని చట్టరీత్యా చర్యలు చేపట్టాలని దీక్షలో కూర్చున్న గ్రామస్తులు , యూత్ సభ్యులు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -