Sunday, August 3, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనైపుణ్యం సాధించిప్పుడే న్యాయం చేయగలం

నైపుణ్యం సాధించిప్పుడే న్యాయం చేయగలం

- Advertisement -

– రాష్ట్ర డీజీపీ జితేందర్‌
– ముగిసిన తెలంగాణ రెండో పోలీస్‌ డ్యూటీ మీట్‌
నవతెలంగాణ-వరంగల్‌

పోలీసు అధికారులు వృత్తిలో ఉత్తమ నైపుణ్యం ప్రదర్శించినప్పుడే ప్రజలకు సరైన న్యాయం అందించగలుగుతామని రాష్ట్ర డీజీపీ జితేందర్‌ తెలిపారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో పీటీసీ మామునూర్‌ వేదికగా మూడ్రోజులుగా జరిగిన తెలంగాణ రెండో పోలీస్‌ డ్యూటీ మీట్‌ శనివారం ఘనంగా ముగిసింది. ఈ ముగింపు వేడుకలకు డీజిపీ జితేందర్‌, జైళ్ల శాఖ డీజీ (డైరెక్టర్‌ జనరల్‌) డాక్టర్‌ సౌమ్య మిశ్రా హాజరయ్యారు. పీటీసీకి చేరుకున్న వారికి పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ పుష్పాగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఛాంపియన్‌ షిప్‌ సాధించిన పోలీస్‌ విభాగాలకు ట్రోఫీలు ప్రధానం చేశారు. ఈ పోటీల్లో అత్యధిక మెడల్స్‌ సాధించిన సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌ ట్రోఫీని డీజిపీ చేతుల మీదుగా అందుకున్నారు. అనంతరం డీజీపీ జితేందర్‌ మాట్లాడుతూ.. ఈ పోటీ లలో విజయం సాధించిన పోలీస్‌ సిబ్బందికి, అధికారులకు అభినంద నలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో రాబోవు జాతీయ పోలీస్‌ డ్యూటీ మీట్‌లో మరిన్ని పతకాలు సాధించాలని, ఈ డ్యూటీ మీట్‌ ద్వారా తమ వృత్తిలో మరిన్ని మెళకువలు, నైపుణ్యాన్ని సాధించడం జరుగుతుందని, తద్వారా మరింత మెరుగైన సేవలు అందించగలుగుతామని చెప్పారు. అలాగే దర్యాప్తు నిర్వహించడంలో ఈ డ్యూటీ మీట్‌లు పోలీస్‌ అధికారులకు ఎంతగానో దోహదపడుతాయని తెలిపారు.
జైళ్ల శాఖ డీజి సౌమ్యమిశ్రా మాట్లాడుతూ.. రెండోసారి వరంగల్‌లో రాష్ట్రస్థాయి డ్యూటీ మీట్‌ ముగింపు కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందని, తాను ఎస్పీగా ఉన్న సమయంలో నిర్వహించిన డ్యూటీ మీట్‌ గుర్తుకు వస్తోందని అన్నారు. త్వరలోనే జైళ్ల విభాగంలో కూడా రాష్ట్ర స్థాయిలో నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, బాణాసంచా షో అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో మల్టీజోన్‌ ఐజీ చంద్రశేఖర్‌ రెడ్డి, సీఐడీ డీఐజీ నారాయణ నాయక్‌, వరంగల్‌, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, డాక్టర్‌ సత్య శారద, స్నేహ శిబరీష్‌, భూపాలపల్లి, మహబూబా బాద్‌ జిల్లా ఎస్పీలు కిరణ్‌ ఖర్గే, సుధీర్‌ కేకన్‌, పిటిసి ప్రిన్సిపాల్‌ పూజ, ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌ పారు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -