Tuesday, October 28, 2025
E-PAPER
Homeజాతీయంతదుపరి సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌

తదుపరి సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌

- Advertisement -

కేంద్రానికి సీజేఐ
జస్టిస్‌ బీఆర్‌ గవాయ్ సిఫారసు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయ మూర్తి (సీజేఐ)గా జస్టిస్‌ సూర్యకాంత్‌ నియా మకం కానున్నారు. ఆయన పేరును ప్రస్తుత సీజేఐ భూషణ్‌ రామకృష్ణ గవాయ్ సోమవారం కేంద్రానికి సిఫారసు చేశారు. జస్టిస్‌ సూర్యకాంత్‌ పేరును ఒక లేఖలో కేంద్ర న్యాయశాఖ మంత్రికి ఆయన తెలియజేశారు. నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తిని సీజేఐ పదవికి ఎంపిక చేస్తారు. ప్రస్తుతం అత్యున్నత న్యాయస్థానంలో జస్టిస్‌ సూర్యకాంత్‌ సీనియర్‌ మోస్ట్‌ న్యాయమూర్తిగా ఉన్నారు. జస్టిస్‌ బిఆర్‌ గవాయ్ నవంబర్‌ 23న ఉద్యోగ విరమణ చేయనున్నారు. దీంతో నవంబర్‌ 24న దేశ 53వ సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ బాధ్యతలు చేపడతారు. 2027 ఫిబ్రవరి 9 వరకూ 15 నెలల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించి నప్పటి నుంచి ఇప్పటి వరకు 300 ధర్మాసనాల్లో భాగంగా ఉన్నారు.

జస్టిస్‌ సూర్యకాంత్‌ జీవిత నేపథ్యం
హర్యానాలోని హిస్సార్‌లో 1962 ఫిబ్రవరి 10న ఒక మధ్యతరగతి కుటుంబంలో జస్టిస్‌ సూర్యకాంత్‌ జన్మించారు. ఒక చిన్న పట్టణ న్యాయవాది నుంచి దేశంలో ని అత్యున్నత న్యాయస్థానికి ఎదిగారు. 1981లో హిసార్‌ లోని ప్రభుత్వ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కళాశాల నుంచి పట్టభద్రులయ్యారు. 1984లో రోV్‌ాతక్‌లోని మహర్షి దయానంద్‌ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్‌ డిగ్రీ పొందారు. 1984లో హిసార్‌లోని జిల్లా కోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1985లో చండీగఢ్‌కు మారారు. పంజాబ్‌, హర్యానా హైకోర్టులో ప్రాక్టీస్‌ చేశారు. రాజ్యాంగ, సర్వీస్‌, పౌర విషయాలలో ప్రత్యేకత కలిగి ఉన్నారు. అనేక విశ్వవిద్యాలయాలు, బోర్డులు, కార్పొరేషన్లు, బ్యాంకులు,హైకోర్టుకు కూడా ప్రాతినిధ్యం వహించారు. 2000 జులై 7న హర్యానాకు అతి పిన్న వయస్కుడైన అడ్వకేట్‌ జనరల్‌గా నియమితులయ్యారు. 2001 మార్చిలో సీనియర్‌ అడ్వకేట్‌గా నియమితులయ్యారు. 2004 జనవరి 09న పంజాబ్‌, హర్యానా హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందే వరకు హర్యానా అడ్వకేట్‌ జనరల్‌ పదవిలో కొనసాగారు. 2007 ఫిబ్రవరి 23, 2011 ఫిబ్రవరి 22న వరుసగా రెండుసార్లు నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ పాలకమండలి సభ్యుడిగా నామినేట్‌ అయ్యారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని డీమ్డ్‌ విశ్వవిద్యాలయమైన ఇండియన్‌ లా ఇన్‌స్టిట్యూట్‌లో వివిధ కమిటీలలో సభ్యుడిగా ఉన్నారు. 2011లో కురుక్షేత్ర విశ్వవిద్యాలయంలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ నుంచి న్యాయశాస్త్రంలో మాస్టర్స్‌ డిగ్రీలో ఫస్ట్‌ క్లాస్‌లో నిలిచి మరో ఘనతను సాధించారు. వివిధ ప్రతిష్టాత్మక జాతీయ, అంతర్జాతీయ సమావేశాలకు కూడా హాజరయ్యారు. 2018 అక్టోబర్‌ 5న హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అలాగే, సుప్రీంకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మెన్‌గా 2024 నవంబర్‌ 12న నియమితుల య్యారు. 370వ అధికరణ రద్దు, భావ ప్రకటనా స్వేచ్ఛ, పౌరసత్వ హక్కులు, ప్రజాస్వామ్యం, అవినీతి, పర్యావరణం, లింగ సమానత్వం వంటి మైలురా యి తీర్పులు ఇచ్చారు. ఎన్నికల జవాబుదా రీతనంపై తన నిబద్ధతను చాటుకుంటూ బీహార్‌ ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది వివరాలను వెల్లడించాలని ఇటీవల ఎన్నికల కమిషన్‌ను ఆయన ఆదేశించారు. సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌తో సహా అన్ని బార్‌ అసోసియేషన్లలో మూడింట ఒక వంతు సీట్లు మహిళలకు రిజర్వ్‌ చేయాలని చారిత్రక ఆదేశాలు సైతం ఇచ్చారు. చట్ట విరుద్ధంగా పదవి నుంచి తొలగించిన మహిళా సర్పంచ్‌ను తిరిగి నియమించిన ధర్మాసనానికి ఆయన నాయకత్వం వహించారు. ఈ విషయంలో లింగ పక్షపాతాన్ని ఆయన ప్రశ్నించారు.అలాగే రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను పరిష్కరించడంలో గవర్నర్‌, రాష్ట్రపతి అధికారాలపై విచారించే ధర్మాసనంలో సూర్యకాం త్‌ ఉన్నారు. వలస రాజ్యాల కాలం నాటి రాజద్రోహ చట్టాన్ని నిలిపివేసిన ధర్మాసనంలో ఆయన భాగంగా ఉన్నారు. ప్రభుత్వ సమీక్ష జరిగే వరకు దాని కింద కొత్త ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయకూడదని ఆదేశించారు. 2022లో ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్‌ పర్యటనలో భద్రతా లోపాలపై దర్యాప్తునకు ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించిన ధర్మాసనంలో కూడా ఆయన ఉన్నారు. రక్షణ బలగాలకు ఓఆర్‌ఓపీ (వన్‌ ర్యాంక్‌-వన్‌ పెన్షన్‌ పథకం) స్కీమ్‌ను సైతం ఆయన ధ్రువీకరించారు. ఇది రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అవుతుందని పేర్కొ న్నారు. పెగాసస్‌ స్పైవేర్‌ కేసును విచారించిన ధర్మాసన ంలోనూ జస్టిస్‌ సూర్యకాంత్‌ ఉన్నారు. శాశ్వత కమిషన్‌లో సమానత్వం కోరుతూ సాయుధ దళాలలోని మహిళా అధి కారుల పిటిషన్లను విచారిస్తున్నారు. ఆపరేషన్‌ సిందూర్‌పై మీడియా సమా వేశాల్లో ప్రాముఖ్యతను సంపాదించిన కల్నల్‌ సోఫియా ఖురేషిని లక్ష్యంగా చేసుకుని మధ్యప్రదేశ్‌ మంత్రి విజరు షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన జస్టిస్‌ సూర్యకాంత్‌, మంత్రి పలికే ప్రతిమాట బాధ్యతాయు తంగా ఉండాలని సూచించారు. అవినీతి పాలన ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని ఆయన పదేపదే నొక్కి చెప్పారు. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేసే ధర్మాసనానికి ఆయన నాయకత్వం వహించారు. సీబీఐ పంజరంలో ఉన్న చిలుక అనే భావనను తొలగించడానికి కృషి చేయాలని సూచిం చారు. గృహ కార్మికులకు చట్టపరమైన భద్రత లేకపో వడాన్ని ఆయన ధర్మాసనం గుర్తించి, ఈ శ్రామిక శక్తికి రక్షణ కల్పించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయా లని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. 1967 ఎఎంయూ తీర్పును కొట్టివేసిన ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాస నంలో జస్టిస్‌ సూర్యకాంత్‌ కూడా ఉన్నారు. దీంతో దాని మైనార్టీ హౌదాను పున్ణపరిశీలించడానికి మార్గం సుగమమైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -