Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన జ్యోతిబాపూలే విద్యార్థులు 

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన జ్యోతిబాపూలే విద్యార్థులు 

- Advertisement -

నవతెలంగాణ – దుబ్బాక 
ఈనెల 25 నుంచి 28 వరకు నిజామాబాద్ జిల్లా ముప్కాల్ లో జరిగే 35 వ సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు దుబ్బాక మండలం హబ్సిపూర్ లోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలుర పాఠశాల పదో తరగతి విద్యార్థులు జీ. కిరణ్, బీ. భవదీష్ లు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ గోపాల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా  పీఈటీ తరుణ్ రాజ్, విద్యార్థులు కిరణ్, భవదీష్ లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ సత్తా చాటి దుబ్బాక ప్రాంతానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -