- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత భవిష్యత్ కార్యాచరణపై సర్వత్రా చర్చ జరుగుతున్న వేళ కవిత తమ పార్టీలో చేరాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆహ్వానించారు. కవిత ప్రజాశాంతి పార్టీలో చేరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోరాడుదామని పిలుపునిచ్చారు. నేను నిన్ను సీఎం చేస్తా అని ఈ మేరకు తాజాగా ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. తాను బీసీల తరఫున పోరాటం చేస్తున్నానని కవిత చెబుతున్నారని, కవిత చెబుతున్న మాటలు నిజమే అయితే ప్రస్తుతం బీసీల పక్షాన ఉన్న ఏకైక పార్టీ ప్రజాశాంతిలో చేరాలన్నారు. కవిత ప్రజాశాంతి పార్టీతో చేతులు కలిపి తాను బీజేపీ వదిలి బాణం కాదని నిరూపించుకోవాలన్నారు.
- Advertisement -