నవతెలంగాణ – ధర్మసాగర్
ఏ పార్టీలో ఉన్నావు అని అడిగితే సరియైన సమాధానం లేక నిక్క తేల్చలేకుండా పదవిలో కొనసాగుతున్న సీనియర్ నాయకులని చెప్పుకుంటున్న కడియం శ్రీహరి హెద్దేవ చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య విమర్శించారు. ఆదివారం మండల కేంద్రంలోని ఖుషి టెంట్ హౌస్ ప్రాంతంలో ఫ్రెండ్షిప్ డే పురస్కరించుకొని టిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ ఘనంగా అనంతరం పత్రిక సమావేశాన్ని నిర్వహించి ఆయన మాట్లాడారు. సీనియర్ నాయకులని చెప్పుకుంటున్న కడియం శ్రీహరి విలేకరులు ప్రశ్నించిన ప్రశ్నకు ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీలోనే ఉన్నాను అని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు.
ఇటు బిఆర్ఎస్ కాదు అటు కాంగ్రెస్ కాదు అని చెప్పే ధైర్యం లేక కాకమ్మ కథలు చెప్పుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారని ఎద్దేవ చేశారు. రాష్ట్రంలోనే జిల్లాలోని టాల్ మాన్ 17 సంవత్సరాలుగా క్యాబినెట్ మంత్రిగా ఉన్న, ఎంపీగా ఎమ్మెల్యేగా కొనిసాగానని, ఉపముఖ్యమంత్రిగా కొనసాగినానని అందరూ నన్ను టార్గెట్ చెయ్యకపోతే మరి ఎవరైనా నన్నే టార్గెట్ చేస్తారని మాట్లాడడం సిగ్గు ఉండాలని అసహ్యించుకున్నారు. ఆ స్థాయి నాయకులని చెప్పుకునే కడియం శ్రీహరి తను కనీసం ఏ పార్టీలో ఉన్నాడని చెప్పుకోలేదని, అటు ఇటు కనోళ్లను ఏమంటారు, వారికో ప్రత్యేకత, సమాజంలో విలువలు, గౌరవం ఉన్నాయి. ఆ మాట నేను అనడం లేదు అంతే అని తీవ్ర విమర్శలు చేశారు. కడియం శ్రీహరి సార్ అని పిలిచే వారి అనుచరులు, మనమే పార్టీ పేరు చెప్పుకొని తిరగాలి, పార్టీ ఏది అని ఆయనను అడగాలని వారిని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
రానున్నది బిఆర్ఎస్ పార్టీనే అని గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో మండల ఇంచార్జ్ కర్ర సోమిరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొడ్డు ప్రభుదాస్, మాజీ సర్పంచులు మామిడి రవీందర్, నాయకులు బేర మధు, కురుసుపల్లి రమేష్, మాచర్ల సుదర్శన్, ఖుషి సాంబ రాజ్, మహేందర్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నిక్క తేల్చకుండా పదవిలో కొనసాగుతున్న కడియం శ్రీహరి: డాక్టర్ తాడికొండ రాజయ్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES