నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు, సైన్స్ ఫిక్షన్ ప్రేమికులు ‘కల్కి 2898 ఎడి’ సీక్వెల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో కీలక అప్డేట్ బయటకు వచ్చింది. దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొని ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ” గతేడాది జూన్ 27న విడుదలైన ‘కల్కి 2898 ఎడి’ భారీ విజువల్ వండర్‌గా మారింది. ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ క్యాస్ట్ ఈ చిత్రంలో నటించడంతో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. భారీ విఎఫ్‌ఎక్స్, యూనిక్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల మన్ననలు పొందింది.
ఈ బ్లాక్‌బస్టర్ సక్సెస్ తర్వాత ఇప్పుడు దఅష్టి మొత్తం సీక్వెల్ పై పడింది., ఈ ఏడాది చివర్లో ‘కల్కి’ సీక్వెల్‌ను సెట్స్‌పైకి తీసుకువెళ్లాలనే ప్లాన్ ఉంది. కానీ ఇది పక్కా కాదు. ఫస్ట్ పార్ట్‌ను మించిపోయేలా సినిమా ఉంటే మాత్రమే సంతృప్తిగా ఉంటుంది. యాక్టర్స్ అందరూ బిజీగా ఉన్నారు, వారి డేట్స్ కుదిరితేనే ముందుకు వెళ్లగలుగుతాం. ప్రీ-విజువలైజేషన్, యాక్షన్ సీక్వెన్స్‌లు ఎక్కువగా ఉంటాయి. అవన్నీ సెట్ చేయడానికి, కంప్లీట్ చేయడానికి టైం పడుతుంది. పోస్ట్ ప్రొడక్షన్‌కు మరింత సమయం అవసరం. నేను ఊహించిన ప్రకారం ఇంకో 2 – 3 ఏళ్లు పట్టే ఛాన్స్ ఉంది ” అని నాగ్ అశ్విన్ అన్నారు.
2027 లేదా 2028 వరకు టైం …
నాగ్ అశ్విన్ వ్యాఖ్యల ప్రకారం … ” ప్రభాస్‌ను మళ్లీ కర్ణుడిగా చూడాలంటే అభిమానులు 2027 లేదా 2028 వరకు ఓపిక పట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్, ప్రీ-ప్రొడక్షన్ పనులు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. సెట్ వర్క్ మొదలైన తర్వాత స్పీడ్ పెంచే అవకాశం ఉంది. విజన్‌ను తగ్గించకుండా, క్వాలిటీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ దర్శకుడు నాగ్ అశ్విన్.. సెకండ్ పార్ట్‌ను ఫస్ట్ పార్ట్‌కు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ మరోసారి భారత సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పనుందని కచ్చితంగా చెప్పవచ్చు. ” గతంలో అశ్వినీదత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ … ప్రభాస్, కమల్, అమితాబ్ మధ్యనే సెకండ్ పార్ట్‌లో ఎక్కువ సన్నివేశాలు ఉంటాయని చెప్పుకొచ్చారు.