Friday, July 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కల్లేపల్లి భేష్: ఎస్ఐ సౌజన్య

కల్లేపల్లి భేష్: ఎస్ఐ సౌజన్య

- Advertisement -

సీసీ కెమెరాల ఏర్పాటులో వీపీఓ శ్రీనివాస్ ప్రత్యేక శ్రద్ధ 
నవతెలంగాణ – బెజ్జంకి
: మండల పరిధిలోని కల్లేపల్లి గ్రామంలో ఎస్ఐ సౌజన్య శుక్రవారం పర్యటించారు. గ్రామంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. వీపీఓ కొడిశెల శ్రీనివాస్ ప్రత్యేక శ్రద్ధ వహించి గ్రామంలో పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయడం..సీసీ కెమెరాల ఏర్పాటులో గ్రామస్తుల భాగస్వామ్యాన్ని ఎస్ఐ అభినందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సౌజన్య గ్రామస్తులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. సైబర్ నేరాలు, మత్తుపదార్థాల వల్ల అనర్థాలు, సీసీ కెమెరాల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. అనంతరం సీసీ కెమెరాలను గ్రామస్తులతో కలిసి ఎస్ఐ ప్రారంభించారు.

చదువు..ఆటలు ప్రాముఖ్యమైనవి: ఎస్ఐ సౌజన్య 

విద్యార్థి దశలో చదువుతో పాటు ఆటలు ప్రాముఖ్యమైనవని ఎస్ఐ సౌజన్య విద్యార్థులకు సూచించారు. మండల పరిధిలోని రేగులపల్లి ప్రభుత్వోన్నత పాఠశాల విద్యార్థులకు ఎస్ఐ సౌజన్య సామాజిక మాద్యమాలు, అపరిచిత వ్యక్తుల సంచారం, గుర్తు తెలియని పోన్ కాల్స్, సామాజిక మాద్యమాల వినియోగం, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సిబ్బంది కొడిశెల శ్రీనివాస్, యాదగిరి, బోధన సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -