నవతెలంగాణ – ఆలేరు రూరల్
ప్రజాకవి కాళోజీ నేటి తరం సాహితీ వేత్తలకు స్ఫూర్తి ప్రధాత అని తెలుగు భాష పండితులు మద్ధూరి కాంతారావు కొనియాడారు. మంగళవారం కాళోజీ 111వ జయంతి సందర్భంగా శారాజిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి.జ్యోతి రాజు, ఉపాధ్యాయ బృందం కాళోజీ నారాయణరావు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలుగు భాష పండితులు మద్ధూరి కాంతారావు మాట్లాడుతూ.. కాళోజీ తన రచనల ద్వారా తెలంగాణ ప్రజానీకాన్ని చైతన్యం చేసిన ప్రజాకవి అన్నారు. కాళోజీ నేటి తరం సాహితీ వేత్తలకు స్ఫూర్తి ప్రదాత అని కొనయాడారు. తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఆయన పాత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంజీవరెడ్డి, రాంచందర్, శ్రీనివాస్, దయాకర్, సంగీత, కృపాకర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కాళోజీ నేటితరం సాహితీ వేత్తలకు స్ఫూర్తి ప్రధాత: కాంతారావు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES