- Advertisement -
నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యాలయాలలో కాలోజి నారాయణరావు జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు మండల ప్రజాపరిషత్ గోవిందరావుపేట కార్యాలయం నందు కాళోజి నారాయణరావు జయంతి వేడుకల సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల అలంకరణ కార్యక్రమము ఎంపిడిఓ శ్రీమతి మమత ఆధ్వర్యంలో నిర్వహించనైనది. ఈ కార్యక్రమంలో కార్యాలయ పర్యవేక్షకులు శ్రీమతి కే సాయి దుర్గ లక్ష్మీ మరియు కార్యాలయ సిబ్బంది ఈజిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -