నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ యాస, భాషతో స్వభాషను అత్తుత్తమ స్థితిలో నిల్పిన గొప్ప రచయిత కాళోజీ నారాయణరావు అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కాళోజీ 111వ జయంతి సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ప్రచురించిన కాళోజీ కథలు పుస్తకాన్ని సోమవారంనాడిక్కడి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాళోజీ రాసిన ‘నా గొడవ’ పుస్తకంలో కవిత్వమే కాకుండా సాహిత్యంలోని అనేక అంశాలను స్పృశించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళోజి జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి, కవి యాకుబ్, ఈమని శివనాగిరెడ్డి, ముచ్చర్ల దినకర్ తదితరులు పాల్గొన్నారు.
స్వభాషా కృషీవలుడు కాళోజీ-మంత్రి జూపల్లి కృష్ణారావు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES