Wednesday, March 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కళ్యాణ లక్ష్మి.. నిరుపేద కుటుంబాలకు వరం

కళ్యాణ లక్ష్మి.. నిరుపేద కుటుంబాలకు వరం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
నిరుపేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లిళ్ల కు ఆసరాగా ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకం ఒక వరం లాంటిదని నిరుపేద కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుందని మద్నూర్ మండలంలోని చిన్న షక్కర్గా గ్రామ సర్పంచి దిగంబర్ హెచ్ కేలూర్ సర్పంచ్ జి లక్ష్మణ్ తెలిపారు. ఆ గ్రామాలలోని నిరుపేద కుటుంబ లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను బుధవారం తాసిల్దార్ కార్యాలయంలో మండల తహసిల్దార్ ఎండి ముజీబ్ చేతుల మీదుగా ఆ ఇద్దరు సర్పంచులు కలిసి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.

చిన్న షక్కర్గా గ్రామానికి చెందిన గజ్రే యమునా బాయ్ క అలాగే హెచ్ కేలూర్ గ్రామానికి చెందిన గంగల్వార్ సుశీలాబాయికి సర్పంచులు తాసిల్దార్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ రెండు గ్రామాలతో పాటు సోనాల , రుశేగావ్, గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -