- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
రక్షాబంధన్ సందర్భంగా శనివారం కామారెడ్డి తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందు ప్రియా చంద్రశేఖర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి ఆయన నివాసంలో రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ రాఖీ పండగ అన్నా చెల్లెళ్ల, అక్క తమ్ముళ్ల అనుబంధానికి ప్రతికగా నిలుస్తుంది అని అన్నారు. ఆడపడుచులు తమ సోదరులకు రాఖీ కట్టి మేము మీకు రక్ష మాకు మీరు రక్షా అనే నినాదాన్ని చాటుతారని, తెలంగాణ ఆడపడుచులకు రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతోపాటు మంత్రి సీతక్క ఉన్నారు.
- Advertisement -