నవతెలంగాణ-కమ్మర్ పల్లి
దేశ రాజధాని న్యూఢిల్లీలో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలంటూ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచేందుకు బుధవారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ధర్నాలో మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. ఢిల్లీలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ నాయకత్వంలో మండలం నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద టిపిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో మండలం నుండి పలువురు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. ధర్నా శిబిరం వద్ద మండలానికి చెందిన సుంకేట శ్రీనివాస్, వూట్నూర్ ప్రదీప్, వల్గొట్ రంజిత్, తదితరులు ఆలస్యం చేయకుండా ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని ప్లకార్డ్స్ ప్రదర్శించారు.
ఢిల్లీ ధర్నాలో కమ్మర్ పల్లి కాంగ్రెస్ శ్రేణులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES