Monday, June 23, 2025
E-PAPER
Homeసినిమా'కన్నప్ప' ఒక చరిత్ర అవుతుంది : మోహన్‌బాబు

‘కన్నప్ప’ ఒక చరిత్ర అవుతుంది : మోహన్‌బాబు

- Advertisement -

హీరో విష్ణు మంచు నటించిన పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’. ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అవా ఎంటర్టైన్మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్ల పై డా.ఎం.మోహన్‌ బాబు నిర్మాణంలో ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను మేకర్స్‌ అత్యంత వైభవంగా నిర్వహించారు. మోహన్‌ బాబు మాట్లాడుతూ, ‘ఆ భగవంతుడి ఆశీస్సులతోనే ఈ చిత్రం ప్రారంభమైంది. ఆ పరమేశ్వరుడు ఇచ్చిన శక్తితోనే ఈ చిత్రాన్ని తీశాం. ఈ మూవీలోని ప్రతీ పాత్ర హీరోలానే ఉంటుంది. ఇందులో నటించిన ప్రతీ ఒక్కరికీ నేను ఎంతో రుణపడి ఉంటాను. నేను మహా భారతం సీరియల్‌ని ఎన్నో సార్లు చూశాను. ‘కన్నప్ప’ సినిమాను ముఖేష్‌ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. తల్లీతండ్రి తప్ప మరో దైవం లేరని చెప్పేవాడు తిన్నడు. ఆ తిన్నడు కన్నప్పగా ఎలా మారాడన్నదే ఈ కథ’ అని తెలిపారు. ”కన్నప్ప’ విష్ణు సినిమా కాదు. ఇది కన్నప్ప సినిమా. ‘కన్నప్ప’ అనేది శివానుగ్రహంతోనే జరిగింది. ఈ ప్రయాణంలో నాకు విజరు, వినరు వెన్నంటే ఉన్నారు. ఈ కథ కోసం పరుచూరి గోపాలకష్ణ చాలా కష్టపడ్డారు. శివ బాలాజీ చేసిన సాయాన్ని బయటకు చెప్పలేను. మోహన్‌లాల్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మా కోసం వచ్చిన అక్షరు కుమార్‌కి థ్యాంక్స్‌. శరత్‌ కుమార్‌తో పని చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను. తమిళంలో ఈ చిత్రం పెద్ద స్థాయిలో రిలీజ్‌ అవుతోందంటే దానికి కారణం ఆయనే. నా కెరీర్‌లో ఉన్న దర్శకులందరిలోనూ ముఖేష్‌ ది బెస్ట్‌. స్నేహంలో కష్ణుడిగా, కర్ణుడిగా రెండు రకాలుంటాయి. నా జీవితంలో కష్ణుడిగా ప్రభాస్‌ ఉంటారు. అసలు ఈ చిత్రాన్ని చేయాల్సిన అవసరం ప్రభాస్‌కి లేదు. నాన్న మీద ఉన్న గౌరవంతోనే ప్రభాస్‌ ఈ మూవీని చేశారు. స్టార్‌గా కంటే.. ప్రభాస్‌ మానవత్వం ఇంకెంతో గొప్పగా ఉంటుంది. నాకు ప్రభాస్‌ కష్ణుడు అయితే.. నేను మాత్రం ప్రభాస్‌కి కర్ణుడిని’ అని విష్ణు మంచు చెప్పారు. దర్శకుడు ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ మాట్లాడుతూ, ‘మోహన్‌ బాబు నన్ను నమ్మి ఇక్కడకు తీసుకువచ్చారు. ‘కన్నప్ప’ను నాకు ఇచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్‌. విష్ణు నటన స్థాయిని అందరూ చూడబోతోన్నారు. ప్రభాస్‌ పాత్ర గురించి ఇప్పుడు నేను ఏమీ చెప్పను. ఏ పాత్ర కూడా హారు, బై అని చెప్పడానికి రాదు. స్టీఫెన్‌ పాటల కంటే.. ఆర్‌ఆర్‌ అందరినీ మరింతగా సర్‌ప్రైజ్‌ చేస్తుంది’ అని తెలిపారు. ”కన్నప్ప’ సినిమాను శివతత్త్వం వ్యాప్తి చేయడానికి తీశారు. డబ్బు కోసం మోహన్‌ బాబు ఈ మూవీని తీయలేదు. ఈ మూవీని ఎవ్వరూ అడ్డుకోకండి. ఇదొక గొప్ప చిత్రం అవుతుంది. ‘కన్నప్ప’ ఒక చరిత్ర అవుతుంది. ఈ సినిమాను, ఈ పాత్రధారుల్ని ఆ శివుడే ఎంచుకున్నాడు’ అని బ్రహ్మానందం చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -